జమిలి ఒక జిమ్మిక్ : పి.చిదంబరం

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 04:15 PM

జమిలి ఒక జిమ్మిక్ : పి.చిదంబరం

న్యూఢిల్లీ, జనవరి 31 : మోదీ ప్రభుత్వం దేశంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలని పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వ ఖజానా కు నష్టమే కాకుండా, ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు వదేలేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా దేశ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. వీటిని సమూలంగా నిర్మూలించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం జమిలి వాదన వినిపిస్తుంది.

ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ..” ఏకకాలంలో ఎన్నికలు జరిపాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది మోదీ ప్రభుత్వం చేస్తున్న మరో జిమ్మిక్. ఒకే దేశం, ఒకే పన్ను అనేది ఓ మాయ. ఇప్పుడు ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలంటూ మరో జిమ్మిక్ చేస్తున్నారు' అని వెల్లడించారు.





Untitled Document
Advertisements