ట్రంప్, మెలానియాల మధ్య విభేదాలు లేవు : వైట్‌హౌస్‌ మీడియా

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 04:36 PM

ట్రంప్, మెలానియాల మధ్య విభేదాలు లేవు : వైట్‌హౌస్‌ మీడియా

వాషింగ్టన్, జనవరి 31 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైట్‌హౌస్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. నేడు కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తో పాటు అతని భార్య మెలానియా కలిసి రాలేదు. ట్రంప్ కు పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ తో సంబంధం ఉందని ఈ విషయం బయట పెట్టవద్దంటూ పెద్ద మొత్తంలో ఆమెకు నగదు చెల్లించినట్లు సమాచారం. ఈ కారణంగానే ట్రంప్‌, మెలానియా మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ సమావేశానికి వీరిరువురు వేరు వేరుగా హాజరు కావడం వదంతులకు ఊతం ఇచ్చినట్లవుతుంది. ఈ విషయాలపై వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సారా శాండర్స్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన అతిథులతో మెలానియా మాట్లాడాలనుకున్నారని అందుకే ట్రంప్ తర్వాత వచ్చినట్లు వివరణ ఇచ్చారు.

Untitled Document
Advertisements