జోఫ్రా ఆర్చర్‌పై అభిమానుల ఆక్రోశం..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 04:40 PM

జోఫ్రా ఆర్చర్‌పై అభిమానుల ఆక్రోశం..

న్యూఢిల్లీ, జనవరి 31: ఐపీఎల్‌-11 సీజన్ కోసం జరిగిన వేలంలో కొత్త కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అందులో ఇంతవరకూ భారత్ అభిమానులకు తెలియని ఓ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌లో రాణించిన ఈ వెస్టిండీస్ క్రీడాకారుడి కనీస ధర రూ.40 లక్షలు ఉండగా రూ.7.20 కోట్ల ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. దీంతో ఎవరా విండీస్‌ ప్లేయర్‌ అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ‘భారత్ కు, ధోనీకి’ వ్యతిరేకంగా జోఫ్రా గతంలో చేసిన ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి.

రెండేళ్ల ముందు టీమిండియా జట్టుకి వ్యతిరేకంగా అతను ట్వీట్లు పెట్టాడు. ‘భారత్‌ను కూల్చాలని, ధోనీ తాను తెలివైన వాడినని అనుకుంటున్నాడు..’ అని ట్వీట్లు చేశాడు. దీంతో జోఫ్రాపై భారత్ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. భారత్ నాశనాన్ని కోరుకున్న క్రికెటర్‌కు ఐపీఎల్‌లో తీసుకోవడం తగదని రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుపై క్రీడాభిమానులు భగ్గుమంటున్నారు.

Untitled Document
Advertisements