'స్నేక్ మేన్' గా శరత్ కుమార్..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 04:53 PM

'స్నేక్ మేన్' గా శరత్ కుమార్..

చెన్నై, జనవరి 31: వెండితెరపై తన అద్భుతమైన నటనతో అటు తమిళంలో ఇటు తెలుగులో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శరత్ కుమార్. మొన్నటిదాకా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు విభిన్నమైన గెటప్ తో అలరించడానికి సిద్ధమయ్యాడు.

ఎస్.ఎస్.కె. నిర్మాణంలో కోలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ పాము గెటప్ లో నటిస్తున్నాడు. ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాకి 'పాంబన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు చెన్నైలో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్ర యూనిట్, ఫస్టులుక్ పోస్టర్స్ ను వదిలారు. ఇందులో నీలి కళ్లతో, పొలుసులతో కూడిన పాము రూపంలో శరత్ కుమార్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో అభిమానులను అందరినీ ఆకట్టుకుంది.

Untitled Document
Advertisements