నిఖిల్ మూవీ విడుదల వాయిదా..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 05:30 PM

నిఖిల్ మూవీ విడుదల వాయిదా..

హైదరాబాద్, జనవరి 31: నిఖిల్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ' చిత్ర౦ తెరకెక్కింది. సంయుక్త హెగ్డే కథానాయిక. అయితే ఈ చిత్ర౦ ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం వచ్చేనెల 16న గానీ, 23న గానివిడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'తొలి ప్రేమ' చిత్రం 10వ తేదీకి వాయిదా వేశారు.

Untitled Document
Advertisements