సఫారీలతో తొలి సమరం..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 10:42 AM

సఫారీలతో తొలి సమరం..

డర్బన్, ఫిబ్రవరి 1 : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన కోహ్లి సేన ప్రస్తుతం సఫారీలతో వన్డే సిరీస్ కు సిద్దమయ్యింది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే సమరం డర్బన్ వేదికగా ఈ రోజు జరగనుంది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి రెండు టెస్టులు కోల్పోయిన భారత్ జట్టు చివరి టెస్ట్ లో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. బౌలింగ్ పరంగా మన పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. నాలుగవ స్థానంలో ఆడేందుకు రహనేను లేదా మనీష్ పాండే ను తుది జట్టులోకి తీసుకునే ఆవకాశాలు కన్పిస్తున్నాయి.

మరోవైపు ప్రత్యర్థి జట్టు లో గాయంతో డివిలియర్స్ మూడు వన్డేలకు దూరం కావడం ప్రోటీస్ కు పెద్ద ఎదురుదెబ్బ. బ్యాటింగ్ విభాగంలో ఆ జట్టుకు 9వ స్థానం వరకు ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అంతే కాకుండా సొంతగడ్డపై ఆడటం సఫారీలుకు కలిసొచ్చే అంశం. ఏది ఏమైనా ఇరుజట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఈ తరుణంలో పోరు హోరాహోరి కావడం ఖాయం.

Untitled Document
Advertisements