అన్ని ట్రైలర్లలో 'అ!' ట్రైలర్ వేరయా..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 11:03 AM

అన్ని ట్రైలర్లలో 'అ!' ట్రైలర్ వేరయా..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: నాచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్‌ త్రిపురనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అ!'. ఈ చిత్రంలో కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రంలోని పోస్టర్లకు మంచి స్పందన లభించింది.

తాజాగా చిత్రం బృందం 'అ!' ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో.. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ తో సాగే ఈ ట్రైలర్ లో ప్రతి ఒక్కరి పాత్ర చాలా వినూత్నంగా రుపుదిద్దినట్లు తెలుస్తోంది. 'చేపలకు కూడా క‌న్నీళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా.. కనపడవంతే..' అంటూ చేపగా నాని చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

Untitled Document
Advertisements