నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు: అమితాబ్

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 11:48 AM

నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు: అమితాబ్

ముంబాయి, ఫిబ్రవరి 1: తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ సంచలన ట్విట్ చేశారు. 'ట్విట్టర్..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. థాంక్యూ' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు అమితాబ్‌ నటించిన 'హమ్‌' చిత్రంలో తను విలన్‌ గొంతు పట్టుకున్న స్టిల్‌ను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ ఫాలోవర్ల సంఖ్య 32,902,353. ఇప్పుడు ఈ ట్విట్ నెట్టింట్లో షికారు చేస్తోంది.





Untitled Document
Advertisements