నేడు అమలులోకి రానున్న ఈ-వేబిల్లు..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 12:08 PM

నేడు అమలులోకి రానున్న ఈ-వేబిల్లు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేతను నిరోధించేందుకు ఈ-వేబిల్లులు ప్రవేశపెట్టనున్నారు. నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా అదే సమయానికి ఈ-వేబిల్లులు సైతం అమలులోకి రానున్నాయి. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి ఈ -వేబిల్లులు తప్పనిసరి. ఇంతకి ఈ-వేబిల్లు.. అనేది ఒక ఎలక్ట్రానిక్ పత్రం. దీంతో ప్రభుత్వానికి.. ఉత్పత్తయిన సరుకు ఎక్కడి నుండి ఎక్కడికి రవాణా అవుతుందో ట్రాక్ చేసే సదుపాయం లభించనుంది.

జీఎస్టీ అమలులో ఈ -వేబిల్లులే చాలా కీలకమైన ఈ-వేబిల్లులను మాత్రం అమల్లోకి తీసుకురాలేదు. దీంతో అన్ని రాష్ట్రాల్లో జనవరి 17 న ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ మేరకు జీఎస్టీ నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రకాశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ-వేబిల్లు పని తీరు అన్ని రాష్ట్రాల్లో ఆశాజనకంగా ఉంది. దీనిని పూర్తిస్థాయిలో అమలు చేసిన ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నామని వెల్లడించారు.

Untitled Document
Advertisements