బడ్జెట్ పై చిదంబరం వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 01:08 PM

బడ్జెట్ పై చిదంబరం వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : పేద ప్రజలకు, వ్యవసాయరంగానికి ఊతమిస్తూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను అరుణ్‌ జైట్లీ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బడ్జెట్‌ విషయమై ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారు.

‘ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యం బడ్జెట్‌ విషయంలో తన డయాగ్నసిస్‌ను తెలిపారు. మరి రోగి (ఆర్థిక శాఖ, మోదీ ప్రభుత్వం) దీని గురించి సరైన చర్యలు తీసుకుంటుందో, లేకపోతే అలానే వదిలేస్తుందో చూడాలి’ అంటూ అంటూ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

Untitled Document
Advertisements