మహేష్ తో జత కడుతున్న పూజా హెగ్డే..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 01:11 PM

మహేష్ తో జత కడుతున్న పూజా హెగ్డే..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటించేందుకు అందాల తార పూజా హెగ్డేను ఎంపిక చేశారు. ఈ విషయాన్నీ స్వయంగా పూజనే తన ట్విట్టర్ లో పేర్కొంది. 'మహేష్ బాబు, వంశీ పైడిపల్లిలతో కలిసి నటించనున్నందుకు ఆనందంగా ఉంది. అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం' అని ట్విట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements