మృతురాలి వివరాలు తెలిస్తే లక్ష రివార్డు..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 01:26 PM

మృతురాలి వివరాలు తెలిస్తే లక్ష రివార్డు..

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : కొండాపూర్ లో ఇటీవల నిండు గర్భిణిని హత్య చేసి గోనే సంచుల్లో కట్టి పడేసిన ఘటన తెలిసిందే. ఈ మిస్టరీని చేధించడం పోలీసులకు కష్టతరంగా మారింది. పోలీసులు సీసీ పుటేజ్ లను పరిశీలించగా మృతదేహం లభ్యమైన ప్రదేశంలో ఓ స్విఫ్ట్ కారు ఆగిన దృశ్యం, అలాగే మరో రెండు కార్ల దృశ్యాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. రెండు కార్ల దృశ్యాలను స్పష్టంగా రాబట్టేందుకు వీడియో ఎన్‌హాన్స్‌మెంట్‌ను చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసును చేధించడం పోలీసులకు కష్టతరం అయిన క్రమంలో మృతురాలికి సంబంధించిన వస్తువుల (గాజులు, దుస్తులు, కాలు మెట్టెలు, కమ్మలు, చేతి ఉంగరాల) ఆధారంగా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల బహుమతిని ప్రకటించారు. వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వివరాలు తెలిసిన వారు గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్-9490617127, ఎస్‌ఐ-9491030375, పీఎస్-9491030378, ఏసీపీ-9491039175 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య కోరారు.

Untitled Document
Advertisements