మంత్రి నారాయణకు పౌర సన్మానం..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 01:44 PM

మంత్రి నారాయణకు పౌర సన్మానం..

గుంటూరు, ఫిబ్రవరి 1 : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నేటి సాయంత్రం పౌర సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మొదటగా జిల్లాలోని స్వర్గపురిని సందర్శిస్తారు. పౌర సన్మాన కార్యక్రమంలో భాగంగా పట్టణాభివృద్ధిపై ప్రసంగించనున్నారు. అనంతరం రూ.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సద్భావన భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కాగా సాయంత్రం 5గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Untitled Document
Advertisements