నిఖిల్ సరసన కేథరిన్..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 02:51 PM

నిఖిల్ సరసన కేథరిన్..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలుగు తెరపై యువ కథానాయకులలో ఒకడైన నిఖిల్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటించిన 'కిరాక్ పార్టీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా మరో సినిమాలో నటించడానికి సిద్దమయ్యాడు నిఖిల్.

తమిళంలో హిట్ కొట్టిన 'కణితన్' రీమేక్ లో నటించబోతున్నాడు. ఇక 'కణితన్' లో కథానాయికగా నటించిన కేథరిన్, తెలుగులో కూడా ఆమెను ఎంపిక చేశారు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ౦ కావొచ్చని అంటున్నారు.

Untitled Document
Advertisements