బడ్జెట్ నిరాశ మిగిల్చింది : ఎల్ రమణ

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 04:26 PM

బడ్జెట్ నిరాశ మిగిల్చింది : ఎల్ రమణ

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ నిరాశను మిగల్చడం బాధాకరమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. కేంద్రం నుండి నిధులను రప్పించడంలో తెరాసా ఎంపీలు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను రాబట్టడంలో ఎంపీలు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తిగా గంగలో కలిపిందన్నారు. ఈ హామీలను అమలు చేయడంలో విఫలమైనందుకు నిరసనగా ఈ నెల 5వ తేదీన టీఎన్‌టీయూసీ 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను రమణ విడుదల చేశారు.

Untitled Document
Advertisements