బడ్జెట్ పై కేజ్రివాల్ తీవ్ర అసంతృప్తి..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 05:22 PM

బడ్జెట్ పై కేజ్రివాల్ తీవ్ర అసంతృప్తి..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలపై మీడియాతో మాట్లాడిన కేజ్రివాల్.. రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులకు కొంత ఆర్థిక సహాయం అందుతుందేమోనని భావించానని కాని కేంద్రం నుండి మొండి చేయి లభించిందన్నారు. ఢిల్లీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

ఈ విషయంపై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ దేశానికి నేర రాజధానిగా మారిపోయింది. నేరస్థులను పట్టుకోవడానికి మహిళలకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలను బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ డిపోలను నిర్మించడానికి మరింత భూమి కావాల్సి ఉండగా అసలు దాని ప్రస్తావనే బడ్జెట్ లో రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికి ఢిల్లీని సెకండ్ గ్రేడ్ సిటిజెన్స్ గా భావిస్తోంద౦టూ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements