నాకు ఈ క్యారెక్ట‌రే కావాల‌నుకున్నాను: రెజీనా క‌సండ్ర

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 06:50 PM

నాకు ఈ క్యారెక్ట‌రే కావాల‌నుకున్నాను: రెజీనా క‌సండ్ర

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వాల్ పోస్ట‌ర్ పతాకంపై నాని నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'అ!'. చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ చిత్రంలో నటిస్తున్న రెజీనా క‌సండ్ర ఆశ్చర్యపరిచే హెయిర్ స్టైల్ తో వేడుకలోని అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్బంగా రెజీనా మాట్లాడుతూ.. 'ప్ర‌శాంత్ క‌థ చెప్ప‌గానే నేను విజువ‌లైజ్ చేశాను. క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో తెలియ‌డంతో.. నాకు ఈ క్యారెక్ట‌రే కావాల‌ని త‌న‌తో అన్నాను.

ప్ర‌శాంత్‌, నానిల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. నా క్యారెక్ట‌ర్ గురించి ఇప్పుడే చెప్ప‌లేను' అని చెప్పింది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, నిత్యామీన‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజమౌళి, అనుష్క హాజరయ్యారు.

Untitled Document
Advertisements