'తొలిప్రేమ' ట్రైలర్ విడుదల..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 10:58 AM

'తొలిప్రేమ' ట్రైలర్ విడుదల..

హైదరాబాద్, ఫిబ్రవరి 2: వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, అభిమానులను ఆకట్టుకుంది.

తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో.. వరుణ్‌ తేజ్‌, రాశీ ఖన్నా మధ్య ప్రేమ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 'కలగా నా జీవితంలోకి వచ్చావ్‌. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్‌.. మళ్లీ ఇలా మెరిశావ్‌‌. కలో నిజమో అర్థం కావడంలేదు' అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగు హైలెట్ గా నిలిచింది. ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది.





Untitled Document
Advertisements