మేడారం "గిరిజన కుంభమేళా" : వెంకయ్య

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:19 PM

మేడారం

భూపాలపల్లి, ఫిబ్రవరి 2 : గిరిజనుల మహా జాతర అయిన మేడారం శ్రీ సమక్క, సారమ్మల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరడంతో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కనుల పండుగగా సాగుతున్న ఈ వేడుకలకు గిరిజన పూజారులు అమ్మవార్లకు ఘన స్వాగతం పలికితే పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపి దేవతలను స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మేడారం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్య.. పూర్వకాలం నుండి ఆచారంగా వస్తున్న ఈ మేడారం సమక్క, సారక్క ఉత్సవాలలో పాల్గొన్నందుకు దేశ పౌరుడిగా, ఉప రాష్ట్రపతిగా ఎంతో సంతోస్తిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ జాతర "గిరిజన కుంభమేళా" అంటూ సంభోధించారు. సాంప్రదాయాలను పాటిస్తూ.. దేశవిదేశాల నుండి ఇక్కడికి వస్తుండడం చాలా గర్వకారణం. సన్మార్గం, సదాచారం, సద్బుద్ధి కలిగి ఉండాలని ఆ వన దేవతలను ప్రార్థించినట్లు వెల్లడించారు.

Untitled Document
Advertisements