'దాదా' రికార్డును సమం చేసిన 'రన్ మెషిన్'..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:27 PM

'దాదా' రికార్డును సమం చేసిన 'రన్ మెషిన్'..

డర్బన్, ఫిబ్రవరి 2‌: భారత్ క్రికెట్ సారథి , కింగ్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు ను నెలకొల్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో కోహ్లీ భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ రికార్డును సమం చేశాడు. గతంలో టీమిండియా జట్టుకు నాయకత్వం వహించిన దాదా కెప్టెన్ గా 11 శతకాలు సాధించాడు. తాజాగా కోహ్లి ఆ రికార్డును అందుకున్నాడు.

నిన్న డర్బన్ లో సఫారీలతో జరిగిన మొదటి వన్డేలో కోహ్లి 112 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ తన కెరీర్‌లో 33వది కాగా కెప్టెన్‌గా 11వది కావడం విశేషం. గంగూలీ 142 ఇన్నింగ్స్‌ల్లో 11 శతకాలు సాధించగా.. కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ ను సాధించాడు.

Untitled Document
Advertisements