ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు బలవన్మరణం..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:52 PM

ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు బలవన్మరణం..

హవానా, ఫిబ్రవరి 2: దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్‌ బలార్ట్‌ (68) గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

'డియాజ్‌ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయినా తీవ్ర మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు' అని ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌ క్యూబాడిబేట్‌ పేర్కొంది. ఫిడెల్‌ క్యాస్ట్రో మొదటి భార్య మిర్టా డియాజ్ బాలార్ట్ కుమారుడు డియాజ్‌ బలార్ట్‌.. ఈయనను స్థానికంగా జూనియర్‌ క్యాస్ట్రో, ఫిడెలిటో గా వర్ణిస్తారు.





Untitled Document
Advertisements