హోటల్ వెయిటర్ ని ఒలింపిక్ క్రీడాకారుడిగా అభివర్ణించిన ఆనంద్ మహేంద్ర

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 03:35 PM

హోటల్ వెయిటర్ ని ఒలింపిక్ క్రీడాకారుడిగా అభివర్ణించిన ఆనంద్ మహేంద్ర

ఆనంద్ మహీంద్రా పరిచయం అక్కర్లేని పేరు ఈయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఒక వైపు వ్యాపారంలో బీజిగా ఉంటూనే సామాజిక అంశలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు. నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనే ఆనంద్ మహీంద్రా మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు. ఓ హోటల్ వర్కర్ పనితీరు నైపుణ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. హోటల్లో పెద్ద పెనంపై ఒకేసారి 16 దోశలు వేయగా.. ఆ 16 దోశలను విడిగా ఒక్కో ప్లేట్ లో పెట్టుకుని, ఆ ప్లేట్లు అన్నింటినీ వెయిటర్ తీసుకెళ్లి ఆర్డర్ చేసిన వారికి ఇవ్వడాన్ని గమనించొచ్చు. నిజానికి ఇలాంటి వాటిని ప్రత్యేక నైపుణ్యాలుగానే చూడాలి.

‘‘మనం వెయిటర్ ఉత్పాదకత రేటును ఒలింపిక్ క్రీడ మాదిరిగా గుర్తించాలి. ఈ విభాగంలో ఈ జెంటిల్ మెన్ నిజంగా బంగారు పతకానికి అర్హుడే’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఈ వీడియోతోపాటు పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వెయిటర్ తన చేతినిండా వరుసగా ప్లేట్లను పెట్టుకుని బ్యాలన్స్ గా తీసుకెళ్లడం చూస్తే ఎవరైనా కానీ మెచ్చుకోకుండా ఉండలేరు. కానీ, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ పోస్ట్ కింద మరో వీడియోని గమనిస్తే.. ఓ బార్ లో మహిళా వెయిటర్ ఒకేసారి భారీ సంఖ్యలో బీర్ల గ్లాసులను తీసుకెళుతూ కనిపిస్తుంది.
https://twitter.com/0075jamesbond/status/1620423664356454400?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1620423664356454400%7Ctwgr%5Ea5002263dd1a346a5f0e48f1c93ee649f0746e76%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763690%2Folympic-sport-anand-mahindra-is-impressed-with-waiters-plate-balancing-skills-tweets-video





Untitled Document
Advertisements