శ్రీకృష్ణుడి మరణానికి కారణం కర్మ ఫలమేనట!

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 04:05 PM

శ్రీకృష్ణుడి మరణానికి కారణం కర్మ ఫలమేనట!

" శ్రీకృష్ణుని మరణం ఒక సామాన్య వేటగాని చేతిలో ఎలా జరిగింది శుకమహర్షి" అని ఆత్రుతతో ప్రశ్నించాడు పరీక్షిత్తు. " రాజా! దానికి ఒక కథ ఉంది. ఆ వేటగాడు ఎవరో కాదు. త్రేతా యుగంలో శ్రీరాముడిచే చెట్టు చాటు నుండి వధింపబడ్డ వాలే!" అని సమాధానం ఇచ్చాడు. ఈ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా పుట్టినట్లే త్రేతా యుగంలో కూడా శ్రీరామునిగా పుట్టాడు. వనవాస కాలంలో సీతా వినియోగంతో ఆమెను అన్వేషించుకుంటూ ఋష్య ముక్క పర్వత ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ ఆంజనేయునితో పాటు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవుని అన్నే వాలి. అన్నగారిచే అవమానింపబడి భార్యను, రాజ్యాన్ని కోల్పోయి కష్టంలో ఉన్నప్పుడు వాలిని సంహరించి కిష్కిందను సుగ్రీవునికి ఇచ్చాడు. ఆ విధంగా వారిని సంహరించాడు శ్రీరాముడు. ఆ సంహరించడం ఓ చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని చంపాడు. మరణ వేదనతో బాధపడుతున్న వాలి నన్ను ఎలా చంపావు నీవు కూడా అలాగే బాన ఘాతంతో మరణిస్తావని శపించాడు. ఆ శాపం శ్రీకృష్ణునికి యుగాంతంలో ప్రాప్తించింది. అప్పుడు శ్రీరాముడు. ఇప్పుడు కృష్ణుడు. ఇద్దరూ శ్రీమన్నారాయణుడే! ఆనాటి వాలే నేటి వేటగాడు. కర్మఫలం అనుభవించి తీరాలి కానీ తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు " అని ముగించాడు శుకుడు.





Untitled Document
Advertisements