ఆ పిండితో చేసిన జిలేబీలు విరోచనాలను ఆరికడతాయట!

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 05:53 PM

ఆ పిండితో చేసిన జిలేబీలు విరోచనాలను ఆరికడతాయట!

జిలేబీలు పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. గుండ్రంగా చక్రాల్లా వట్టి వాటిని నూనే లేదా నేతిలో వేయించి బెల్లం లేదా పంచదార పాకంలో వేసి చక్కగా నాని తరువాత తింటే ఆహా అనిపించకమానదు. పండగలు పబ్బాలు శుభకార్యాలు.. విందులు, వినోదాలు సందర్భం ఏదైనా భోజనాలలో జిలేబీలది ప్రత్యేక స్థానం. అయితే జిలేబీలు తినడానికి రుచిగా ఉంది నోరురించడం మాత్రమె కాకుండా విరోచనాలు అరకడతాయనే విషయం మనలో చాలా మందికి తెలియదు.
జిలేబీలు విరేచనాలను తగ్గిస్తాయనేది వాస్తవం కానీ, రోడ్డు మీద వేసేవి. మిఠాయి కొట్లలో దొరికేవి తెచ్చుకొని తింటే విరేచనాలు తగ్గకపోగా పెరుగుతాయి. ఒక్కోసారి ప్రాణాపాయం జరుగుతుంది కూడా..
1. జిలేబిలను గోధుమపిండితో వండితే మంచిది శక్తి కల్గిన వారు నేతిలో వండుకుంటే ఇంకా బాగా పనిచేస్తాయి.
2. మొదట కొద్దిగా వేడిచేస్తాయిగాని, ఆ తర్వాత చలవచేస్తాయి.
3. బలాన్నిస్తాయి. నీరసాన్ని తగ్గిస్తాయి.
4. జిలేబిలను నానబెట్టిన పాకాన్ని మూడుపూటలా పావుగ్లాసు చొప్పున తీసుకొని వేణీళ్ళు తాగండి. విరేచనాలు ఆగుతాయి. 5. జిలేబిలను తిన్న తర్వాత కూడా వెళ్లిళ్ళు తాగాలి. నీళ్ళ విరేచనాలు, జిగురు విరేచనాలు, రక్తంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి. అమీబియాసిస్ వ్యాధిలో కూడా ఇది మంచి మందు కానీ, రోడ్డు మీద జిలేబిలు తింటే మాత్రం లేని అమీబియాసిస్ వ్యాధి పుట్టుకొస్తుంది ఇది హెచ్చరిక.
6. వేడి శరీరం వున్నవారికి చలవని కల్గిస్తాయి కడుపులోమంట, పైత్యం తగ్గిస్తాయి.
17. అతిగా తింటే దగ్గు జలుబు, ఆయాసాన్ని తెచ్చిపెడతాయి. పైత్యం చేస్తాయి.
8. జిలేబిలు తిన్నప్పుడు ధనియాలు, జీలకర్ర వంటి జీర్ణశక్తిని పెంచే వాటిని కూడా తీసుకొంటే జిలేబీల వలన కలిగే మేలు శరీరానికి సమకూరుతుంది. చెడు జరక్కుండా వుంటుంది.





Untitled Document
Advertisements