రాష్ట్ర జీఎస్‌డీపీలో 45 శాతం హైదరాబాద్‌దే : కేటీఆర్

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 02:15 PM

రాష్ట్ర జీఎస్‌డీపీలో 45 శాతం హైదరాబాద్‌దే : కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదేనంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. 66 వ జాతీయ టౌన్ కంట్రీ ప్లాన్సర్స్ కాంగ్రెస్ సదస్సును హోటల్ తాజ్‌కృష్ణలో ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెరుగైన జీవన౦, విద్య, ఉపాధి కోసం ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 45 శాతం హైదరాబాద్‌దేనన్న కేటీఆర్.. 2030 కల్లా దేశంలోని 50 శాతం జనాభా నగరాల్లో నివసిస్తుందన్నారు. చెరువుల్లో ఉన్న శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే 400 శాతం పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు.

Untitled Document
Advertisements