వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన కేసీఆర్..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 02:44 PM

వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన కేసీఆర్..

భూపాలపల్లి, ఫిబ్రవరి 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఆయన కుటుంబసమేతంగా దేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే నిలువెత్తు బంగారం అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్నారు. కాగా సీఎం వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Untitled Document
Advertisements