ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నా : కేసీఆర్

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 03:57 PM

ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని కోరుకున్నా : కేసీఆర్

భూపాలపల్లి, ఫిబ్రవరి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారం చేరుకుని అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమ్మక్క, సారక్కలు తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనమన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరను జాతీయపండుగగా గుర్తించాలని ప్రధానిని కోరతానన్నారు. జాతరలో అన్ని సదుపాయాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అలాగే ఈ మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం 200 కోట్లు కేటాయించనున్నామని అలాగే 200 ఎకరాల స్థలంలో శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని వెల్లడించారు.

Untitled Document
Advertisements