కేటీఆర్‌కు ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 04:15 PM

కేటీఆర్‌కు ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి..

హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు దావోస్ నుండి ఎటువంటి ఆహ్వానం అందలేదని పీసీసీ ఛీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్వీ కార్యకర్తలు మండిపడ్డారు. నిజానిజాలు తెలీకుండా ఇలా అసత్య ప్రచారాలు చేయడం తగదంటూ దీనికి నిరసనగా నేడు గాంధీ భవన్ ను ముట్టడించారు. ఉత్తమ కుమార్ వెంటనే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పవలసిందేనని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వద్ద నిరసనకు దిగిన వారిని పోలీసులు బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Untitled Document
Advertisements