'ఇంటిలిజెంట్‌' మేకింగ్‌ వీడియో విడుదల..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 04:37 PM

'ఇంటిలిజెంట్‌' మేకింగ్‌ వీడియో విడుదల..

హైదరాబాద్, ఫిబ్రవరి 2 ‌: టాలీవుడ్ సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, టాప్ దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘కొండవీటి దొంగ’ చిత్రంలో చిరంజీవి ఆడిపాడిన 'ఛమకు ఛమకు ఛాం' పాటను ఇందులో రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ రూపొందించిన మేకింగ్‌ వీడియో అభిమానులును ఆకట్టుకుంటుంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటిస్తుంది. తమన్‌ బాణీలు అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements