వచ్చే ఏడాది ఆరోగ్య బీమా పథకం : జైట్లీ

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 05:57 PM

వచ్చే ఏడాది ఆరోగ్య బీమా పథకం : జైట్లీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ మేరకు జైట్లీ మాట్లాడుతూ.. ఈ ఆరోగ్య బీమా పథకం అనేది ప్రభుత్వ, ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.. ఇది ఒక నగదు రహిత పథకం అన్న జైట్లీ.. ట్రస్ట్ నమూనాలో నడపాలా.? లేదంటే బీమా నమూనాలో నడపాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ పథకంపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి, పనితీరును సైతం పరిశీలించి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి అమలులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Untitled Document
Advertisements