ఆయనతో సినిమా నా అదృష్ట౦ : అదితిరావు

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 10:30 AM

ఆయనతో సినిమా నా అదృష్ట౦ : అదితిరావు

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా, నటించలానుకుంటారు. ఆయన సినిమాలో ఒక్కసారి అవకాశం వస్తే చాలు అనుకునేవారుండరు. కానీ ఈ సుందరికి మాత్రం రెండో సారి కూడా ఆ అదృష్టం వరించింది. అదేనండి మణిరత్నం తెరకెక్కించిన చిత్రం 'చెలియా' సినిమాలోని హీరోయిన్ అదితిరావు హైదరి. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయిన అదితికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మణిరత్నం రూపొందించే సినిమాలో అదితిని కథానాయికగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంపై అదితి స్పందిస్తూ.. 'మణిరత్నం దర్శకత్వంలో మరో సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. 'చెలియా' సినిమా ద్వారా నా అభిమాన దర్శకుడితో పనిచేయాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. నమ్మలేకపోయా.. థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆయన స్టైల్‌, క్రమశిక్షణ నాకు కూడా అలవడటం గొప్ప అనుభూతి. ఆయనతో కొత్త సినిమా షూటింగ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని తెలిపింది.

Untitled Document
Advertisements