ఏసీబీ వలలో మరో తిమింగలం..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 11:22 AM

ఏసీబీ వలలో మరో తిమింగలం..

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సంచాలకుడిగా పనిచేస్తున్న పురుషోత్తం రెడ్డికి అక్రమాస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సాగర్ సొసైటీలో ఉన్న ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఆ ఇంటి విలువ రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకు పురుషోత్తం రెడ్డికి సంబంధించిన అన్ని ఆస్తులపై ఏసీబీ ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 11 ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించగా ముందే ఈ విషయం తెలుసుకున్న పురుషోత్తం ఇంటి నుండి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.

Untitled Document
Advertisements