నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 11:58 AM

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

నల్గొండ, ఫిబ్రవరి 3 : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొ౦ది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. నల్గొండలో రేపు బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ జరగనున్న నేపథ్యంలో క్యాటరింగ్ పనుల నిమిత్తం ఆ కార్మికులు అక్కడకు వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో నార్కట్‌పల్లి రోడ్డులోని అద్దంకి మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు దిగాల్సి ఉంది కాని వారికి ఆ ప్రాంతం కొత్త కావడంతో చిరునామా కనుక్కోలేక ముందుకు వెళ్లి బస్సు దిగారు. అక్కడి నుండి అడ్రస్ వెతుక్కుంటూ నడుస్తూ వస్తున్న క్రమంలో ఒక వాహనం వారిని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements