భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న మంత్రి..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 12:35 PM

భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న మంత్రి..

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 3 : సింధ్ ప్రావిన్స్‌లో ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్న ఓ మంత్రి తన భార్యను కాల్చి చంపి తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్తాన్ లో మీర్ హ‌జార్ ఖాన్ అనే మంత్రి పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన వ్యక్తి. ఈ దారుణానికి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే కారణమంటూ పోలీసు అధికారులు భావిస్తున్నారు.

మొదట తన భార్య ఫ‌రిహా ర‌జాక్‌ను పిస్టల్ తో కాల్చి చంపిన హ‌జార్ ఖాన్.. అనంతరం తానూ ఆడే పిస్టల్ తో కాల్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవన్ని ఒకే పిస్టల్ కి సంబంధించినవని తెలిపారు. మంత్రి తలలో ఒక బుల్లెట్ లభ్యం కాగా, ఆయన భార్య తలలో మూడు బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

Untitled Document
Advertisements