రాజీవ్ కనకాలకు మాతృవియోగం..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 01:01 PM

రాజీవ్ కనకాలకు మాతృవియోగం..

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ప్రముఖ నటి, నట శిక్షకురాలు కనకాల లక్ష్మీదేవీ(78) తుదిశ్వాస విడిచారు. తన కుమారుడు రాజీవ్ కనకాలను ప్రముఖ విలక్షణ నటుడిగా లక్ష్మీదేవే తీర్చిదిద్దారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతోమందికి భర్త దేవదాస్ తో కలిసి లక్ష్మీదేవి నటనలో శిక్షణ ఇచ్చారు. 'ప్రేమ బంధం', 'పోలీస్ లాకప్', 'కొబ్బరి బొండం', 'ఒకఊరికథ' మొదలైన చిత్రాల్లో నటించిన లక్ష్మీదేవి ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యారు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది.





Untitled Document
Advertisements