కశ్మీర్‌ ఒక స్వర్గం : మెహబూబా ముఫ్తీ

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 01:27 PM

కశ్మీర్‌ ఒక స్వర్గం : మెహబూబా ముఫ్తీ

జమ్మూకశ్మీర్, ఫిబ్రవరి 3 : కశ్మీర్‌ స్వర్గం. ఆ స్వర్గాన్ని కాపాడటం కోసం వందల సార్లు నరకానికి వెళ్లడానికైనా నేను సిద్దమ౦టూ జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

ఇటీవల కశ్మీర్ లో అధికారిక పీడీపీ, బీజేపీ పొత్తుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా.. "రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు దెయ్యంతో పొత్తులాగే ఉన్నాయి. ఈ పాలనా విధానాలను ఉపవాసాలు, ప్రార్థనలు చేసి మార్చాలి. అప్పుడు రాజకీయ ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉంటుంది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఫ్తీ.. "అబ్దుల్లా నేను నరకానికి వెళ్లాలంటూ ఫత్వా ఇస్తున్నట్లున్నారు. కాని కశ్మీర్‌ స్వర్గం. ఆ స్వర్గాన్ని కాపాడటం కోసం వందల సార్లు నరకానికి వెళ్లడానికైనా నేను సిద్ధ౦. అది నాకు పెద్ద కష్టమేమి కాదు. ప్రజా శ్రేయస్సు కోసం నేను ఆ పని చేస్తే నాకు సంతోషమే" అంటూ బదులిచ్చారు.

Untitled Document
Advertisements