బడ్జెట్ పై కత్తి మహేష్ సెటైరికల్‌ పోస్ట్..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 03:29 PM

బడ్జెట్ పై కత్తి మహేష్ సెటైరికల్‌ పోస్ట్..

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్వరాలూ వినిపిస్తున్నాయి. పేదలకు, వ్యవసాయ రంగాలకు ఊతమిచ్చిన మోదీ ప్రభుత్వం, మధ్యతరగతి, వేతన జీవులను, నిరుద్యోగ యువతను విస్మరించిదని పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కత్తి మహేష్ బడ్జెట్ విషయంపై బీజేపీ ప్రభుత్వం గురించి ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెడుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసిన మహేష్ కట్టప్పను బీజేపీగా.. బాహుబలిని మధ్యతరగతి ప్రజలుగా చిత్రించి ఇది 2014లో పరిస్థితిగా వర్ణించారు. అనంతరం బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే చిత్రాన్ని తీసుకుని కట్టప్పను బీజేపీగా.. ప్రభాస్‌ను మధ్యతరగతి ప్రజలుగా చిత్రించి ఇది 2018లో పరిస్థితిగా వివరించారు.

Untitled Document
Advertisements