బెంగళూరులో మస్క్ ఫొటోకు పూజలు.. కారణం ఇదే

     Written by : smtv Desk | Wed, Mar 01, 2023, 11:53 AM

బెంగళూరులో మస్క్ ఫొటోకు పూజలు.. కారణం ఇదే

ప్రపంచ కుబేరులలో ఒకరు, టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ఈయన ట్విట్టర్ కొనుగోలు వ్యవహరం మొదలు పెట్టిన నాటి నుండి మస్క్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ట్విట్టర్ను చేజిక్కించుకున్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచారు. సంస్థలతో భారీగా ఉద్యోగులను తొలగించి చాలా మందికి విలన్ అయ్యారు. కానీ, బెంగళూరులో కొందరు మస్క్ ను దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన ఫొటోకు పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ అనే సంస్థ ఈ పని చేసి వార్తల్లో నిలిచింది. పురుషుల బాధల్ని చెప్పుకునేందుకు ట్విట్టర్‌లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఆ సంస్థ ప్రతినిధులు మస్క్ పై అభిమానం చాటుకున్నారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మస్క్ ఫ్లెక్సీకి ప్రత్యేక పూజలు చేశారు. ఫ్లెక్సీలో స్త్రీవాదులను అంతం చేసేవారు (డిస్ట్రాయర్ ఆఫ్ వొకాషురా), మెన్స్ లైవ్స్ మ్యాటర్ అనే ట్యాగ్‌లైన్ కూడా ముద్రించారు.


Untitled Document
Advertisements