మూడేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి : లోకేష్

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 04:04 PM

మూడేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి : లోకేష్

అట్లాంటా, ఫిబ్రవరి 3 : ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. నవ్యాంధ్రలో పెట్టుబడుల నిమిత్తం అమెరికాలోని అట్లాంటాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఏపీలో పెట్టుబడులపై గల అవకాశాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌ఆర్ఐలకు మేలు చేయాలని ఆలోచిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని రాయితీలు, సబ్సిడీలు, పాలసీలు ఇస్తున్న తీరును వివరించారు. మూడేళ్ల కాలంలో రాష్ట్ర౦ ఎంతో అభివృద్ధి చెందిందన్న ఆయన.. ఎన్ఆర్ఐలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణను అందించనున్నామని దీనికి ఎన్ఆర్ఐలు సహకరించాలని కోరారు.

Untitled Document
Advertisements