తారక్ ను వరించిన హెచ్సీఏ అవార్డు.. ఫోటోలు షేర్ చేసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

     Written by : smtv Desk | Fri, Mar 03, 2023, 12:59 PM

తారక్ ను వరించిన  హెచ్సీఏ అవార్డు.. ఫోటోలు షేర్ చేసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

ప్రస్తుతం ప్రపంచ సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' పేరు వినిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన టాలీవుడ్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డుల బరిలో కూడా నిలిచింది.
అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాను నలుమూలలకు చాటుతోంది. ప్రఖ్యాత హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే హెచ్సీఏ అవార్డుల్లో సైతం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. స్పాట్ లైట్ అవార్డును రామ్ చరణ్ అందుకున్నాడు.

మరోవైపు, హెచ్సీఏ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రాకపోవడంపై ఆయన ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ కు కూడా అవార్డులు ఉన్నాయని హెచ్సీఏ ప్రకటించింది. తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఆయన అమెరికాకు రాలేకపోయినట్టు తమకు తెలిపారని వెల్లడించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన అవార్డుల ట్రోఫీలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను స్పాట్ లైట్ అవార్డ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు తారక్ కు వచ్చినట్టు తెలిపింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. స్పాట్ లైట్ అవార్డును అలియా భట్ కు కూడా హెచ్సీఏ ప్రకటించింది.

'డియర్ ఆర్ఆర్ఆర్ సపోర్టర్స్ అండ్ ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చిన అవార్డులను మీతో పంచుకుంటున్నాం. వచ్చే వారం ఈ అవార్డులను వారికి పంపిస్తున్నాం' అని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.





Untitled Document
Advertisements