నాన్నకి మద్దతుగా ఉంటా: శ్రుతి హసన్

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 11:17 AM

నాన్నకి మద్దతుగా ఉంటా: శ్రుతి హసన్

హైదరాబాద్, ఫిబ్రవరి 4: వెండితెరపై తనదైన శైలి నటనతో అందరినీ మెప్పించి అందంతో అభినయంతో ఆకట్టుకుంది దక్షిణాది ముద్దుగుమ్మ శ్రుతి హసన్. కెరీర్ ప్రారంభం నుంచి ఈ సుందరి ప్రతి సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటుంది. ఇటీవల ఆమె సినిమాల గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఓ కథను ఎంచుకున్నప్పుడు అందులో నా పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నటించడానికి ఒప్పుకుంటాను. ప్రస్తుతం తమిళంలో కొన్ని కథలు విన్నా.

అందులో ఓ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రకటన రానుంది. నేను, అక్షర కలిసి నటించేలా కొన్ని కథలొచ్చాయి. కానీ ఆ కథలు మేం ఆశించినంతా స్థాయిలో లేవు. మంచి కథ కుదిరితే తప్పకుండా కలిసి చేస్తాం. ఇక రజనీకాంత్‌, నాన్నల రాజకీయ ప్రవేశం విషయానికి వస్తే నేను నాన్నకి మద్దతుగా ఉంటా. నాన్నకు ప్రారంభం నుంచే సమాజ సేవ అంటే ఇష్టం. తన సినిమాల్లో కూడా చాలా విషయాలను పరోక్షంగా చూపించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలకు ఎదో చేయాలనీ ఆయన తీసుకున్న నిర్ణయానికి నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements