ముగిసిన "తెలంగాణ కుంభమేళా"

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 11:21 AM

ముగిసిన

భూపాలపల్లి, ఫిబ్రవరి 4 : "తెలంగాణ కుంభమేళా" గా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క, సారక్క జాతర ముగిసింది. వనదేవతలు మేడారం గద్దె నుండి తిరిగి వనంలోకి ప్రవేశించడంతో జాతర పరిపూర్ణమై౦ది. పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజు కొండాయికి పయనమయ్యారు. రెండేళ్లకు ఒకసారి వచ్చి నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం మహా జాతరలో చివరి ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు.

ఈ ఏడాది జాతరకు 1.25కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ముఖ్యమంత్రి కేసీఆర్, ఛత్తీస్‌ఘడ్‌ సీఎం రమణ్‌సింగ్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ జాతరలో పాల్గొన్నారు. మళ్ళీ వెచ్చే జాతర సమయానికి మేడారంలో శాశ్వత ఏర్పాట్లు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.





Untitled Document
Advertisements