సెంచూరియన్ లో సత్తా చాటాలి..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 11:27 AM

సెంచూరియన్ లో సత్తా చాటాలి..

సెంచూరియన్, ఫిబ్రవరి 4 : దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో విజయం సాధించిన కోహ్లి సేన ఈ రోజు సెంచూరియన్ లో జరిగే రెండో వన్డేలో సత్తా చాటాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే 2-0తో సిరీస్ లో ముందంజలో ఉండడమే కాకుండా వన్డే ర్యాంకింగ్స్ లో తొలిస్థానంలో నిలుస్తుంది. అయితే నెంబర్ వన్ స్థానంలో భారత్ ఉండాలంటే 4-2తో సిరీస్ ను వశం చేసుకోవాలి. మొదటి మ్యాచ్ గెలుపుతో జట్టులో ఎటువంటి మార్పు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.

మరో వైపు ప్రత్యర్థి జట్టులో స్టార్ ఆటగాళ్లు డివిలియర్స్, కెప్టెన్ డుప్లెసిస్ గాయాలతో దూరమయ్యారు. మర్క్రం ను సఫారీ సారథిగా బోర్డు అధికారులు నియమించారు. 2014 అండర్-19 దక్షిణాఫ్రికాను విజేతగా నిలిపిన మర్క్రం ఇప్పుడు జట్టును ఏ విధంగా నడిపిస్తాడన్నది ఆసక్తికరం.

Untitled Document
Advertisements