వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారు.. శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్

     Written by : smtv Desk | Mon, Mar 20, 2023, 05:33 PM

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారు..  శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు మరింత వేగవంతంగా మారింది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులను, వివేకతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులను విడతల వారీగా విచారించారు. అయితే ప్రస్తుతం వివేకా హత్య కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలంటూ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి సజావుగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నారని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.





Untitled Document
Advertisements