కవిత తీరు చూస్తుంటే నేరాన్ని అంగీకరించనట్టే భావించాలా?.. విష్ణువర్ధన్ రెడ్డి

     Written by : smtv Desk | Tue, Mar 21, 2023, 02:30 PM

కవిత తీరు చూస్తుంటే నేరాన్ని అంగీకరించనట్టే భావించాలా?.. విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించి కొందరు రాజకీయ ప్రముఖుల అరెస్టులకు కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన వద్ద ఉన్న ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులకు అప్పగించేందుకు ఈ రోజు ఈడీ ఆఫీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఈడీ కార్యాలయం ఎదుట కారు దిగుతూ, ఫోన్లు ఉన్న సంచిని కవిత మీడియాకు చూపించారు.

కవిత చూపించిన ఫోన్ల సంచి పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కవిత 9 ఫోన్లు ఎందుకు ఉపయోగిస్తున్నట్టు? అని ప్రశ్నించారు. ఆమెకు ఏమైనా మొబైల్ ఫోన్ల దుకాణం ఉందా? మొబైల్ ఫోన్ల దుకాణం యజమానులు కూడా అన్ని ఫోన్లు ఉపయోగించరు అని విమర్శించారు.

కేవలం బుకీలు, మనీలాండరింగ్, హవాలా కార్యకలాపాలకు పాల్పడే వారే ఆమె లాగా అన్ని ఫోన్లు ఉపయోగిస్తారు అని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. ఆమె చిత్రాలు చూస్తుంటే నేరాన్ని అంగీకరించనట్టే భావించాలా? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కవిత ఫోన్లు ఉన్న సంచిని మీడియాకు ప్రదర్శిస్తున్న ఫొటోలను కూడా విష్ణు పంచుకున్నారు.





Untitled Document
Advertisements