పెరిగిన గడ్డంతో భాదపడుతున్న మహిళ.. విడాకులిచ్చిన భర్త

     Written by : smtv Desk | Tue, Mar 21, 2023, 02:39 PM

పెరిగిన గడ్డంతో భాదపడుతున్న మహిళ.. విడాకులిచ్చిన భర్త

పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఊహించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా కలసిమెలసి జీవించిన వ్యక్తులు అనుకోని పరిణామాలు ఏర్పడి వారి మధ్య ఉన్న బంధం బీటలు వారవచ్చు. అటువంటి సంఘటనే ఒకటి ఇక్కడ చోటు చేసుకుంది. భార్య గుబురు గడ్డాన్ని తట్టుకోలేక ఓ భర్త విడాకులు ఇచ్చేశాడు. భర్త తిరస్కరణతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయింది. ఆ తరువాత ఆమె పరిస్థితులతో రాజీపడటం నేర్చుకుని క్రమంగా కోలుకుంది. ఇటీవలే మీడియాతో తన జీవిత విశేషాలను పంచుకుంది. పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్‌కు 2012లో వివాహం జరిగింది. వివాహానికి ముందు ముఖంపై రోమాలే ఎరుగని ఆమె పరిస్థితి ఆ తరువాత ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. చూస్తుండగానే ముఖంపై గుబురు గడ్డం ప్రత్యక్షమైంది. ఈ పరిణామాలను తట్టుకోలేని ఆమె భర్త విడాకులిచ్చేశాడు. ఇలా అనూహ్యంగా జీవితం తలకిందులు అవడంతో మన్‌దీప్ తీవ్ర దుఃఖంలో కూరుకుపోయింది.

అయితే.. బతుకంతా నిరాశలోనే గడిపేయద్దనుకున్న ఆమె తనలోని మార్పులను సానుకూల ధోరణితో స్వీకరించింది. దైవ ప్రార్థనతో ప్రతికూల భావాలను తొలగించుకుంది. రోజూ గురుద్వారాకు వెళ్లడంతో తనలో మార్పు మొదలైందని మన్‌దీప్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె గడ్డం తీసుకోవడం కూడా మానేసింది. తనను తొలిసారి చూసిన వారందరూ పురుషుడే అనుకుంటారని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మగాళ్లలాగానే బైక్ నడుపుతానని, తన సోదరులతో కలిసి పొలం పనులకు వెళతానని కూడా ఆమె వివరించింది. ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గతంలోనూ కొందరు మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. బ్రిటన్‌లో స్లో ప్రాంతానికి చెందిన హర్‌నామ్‌ కౌర్‌కు పాలీసిస్టిక్ ఓవరీస్ అనే వ్యాధి ఉంది. దీంతో.. చిన్న వయసులోనే ఆమె ముఖంపై రోమాలు మొలవడం ప్రారంభించాయి. తన పదకొండవ ఏటనే ఈ సమస్య మొదలైంది. రోమాలను తొలగించుకునేందుకు ఆమె తరచూ వ్యాక్సింగ్ చేసేది. కొన్నేళ్ల పాటు ఇలా చేసి విసిగిపోయిన హర్‌నామ్ చివరకు పరిస్థితులకు అలవాటు పడటడమే కాకుండా, తన గడ్డాన్ని గర్వంగా ప్రదర్శించేందుకు నిశ్చయించుకుంది.





Untitled Document
Advertisements