సీపీఎం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులు.. రాఘవులు రాజీనామా

     Written by : smtv Desk | Fri, Mar 24, 2023, 01:12 PM

సీపీఎం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులు.. రాఘవులు రాజీనామా

రాజకీయాలు అన్న తరువాత నాయకు మాట మార్చడం, ఇచ్చిన మాట తప్పడం, ప్రస్తుతం తాము కొనసాగుతున్న పార్టీ నచ్చని పక్షంలో ఆ పార్టీ నుండి వైదొలగడం ఇవన్నీ సహజమే. అయితే ఒక వ్యక్తి పార్టీ నుండి వైదొలగడం అనేది సదరు పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. తాజాగా సీపీఎంకు ఇదే తరహాలో గట్టి షాక్ తగిలింది. సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి సీనియర్ నేత బీవీ రాఘవులు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదుల నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు ఆయన రిజైన్ చేసినట్లు సమాచారం.

అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రాయాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐలో పని చేస్తూ క్రమేణా కీలకంగా రాఘవులు ఎదిగారు. పార్టీలో రాఘవులు పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. సీపీఎం సంస్థాగత నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.





Untitled Document
Advertisements