మా ఇద్దరి మధ్య పోటీలేదు: వరుణ్ తేజ్

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 12:47 PM

మా ఇద్దరి మధ్య పోటీలేదు: వరుణ్ తేజ్

భీమవరం, ఫిబ్రవరి 4: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'తొలిప్రేమ'. కథానాయిక రాశీ ఖన్నా. దర్శకుడు వెంకీ అట్లూరి. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ ప్రేమ కథాంశ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర విడుదలకు ముందస్తుంగా భీమవరం పట్టణంలోని ఎస్సార్‌కేఆర్‌ ఇంజినీరింగు కళాశాల ఆవరణలో ఓ వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా వరుణ్ మాట్లాడుతూ.. 'భీమవరం ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది.

1998లో బాబాయ్‌ పవన్‌ తొలిప్రేమ సినిమాను మళ్ళీ 20 ఇరవయ్యేళ్ల తరువాత అదే పేరుతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ కథను చాలా సరికొత్తగా తెరకెక్కించారు వెంకీ అట్లూరి. అంతేకాకుండా సాయిధరమ్‌తేజ్‌ నటించిన 'ఇంటిలిజెంట్'‌ ఈ నెల9న విడుదల కాబోతు౦ది. ఆ మరుసటి రోజు 'తొలిప్రేమ'ను విడుదల చేస్తున్నాం. మా ఇద్దరి మధ్య పోటీలేదు. రెండు సినిమాలు పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

Untitled Document
Advertisements