టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కు అమితాబ్‌ షాక్..

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 01:13 PM

టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కు అమితాబ్‌ షాక్..

ముంబాయి, ఫిబ్రవరి 4: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ టాలీవుడ్‌ సెలబ్రిటీస్‌కి షాక్ ఇచ్చారట. ఇంతకి అదేంటి అనుకుంటున్నారా.. సామాజిక మాధ్యమాలలో ఒకటైన ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న అమితాబ్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురి ట్విటర్ ఖాతాలను అనుసరించడం మొదలు పెట్టారట.

తెలుగులో అగ్రకథానాయికలైన రకుల్‌ప్రీత్‌ సింగ్‌, లావణ్య త్రిపాఠి, యువ కథానాయకులు నిఖిల్‌,సందీప్‌ కిషన్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, వెన్నెల కిశోర్‌ తదితరులు అమితాబ్‌ ఫాలో అవుతున్నట్లు వచ్చిన నోటిఫికేషన్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి, ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తమ అభిమాన నటుడు అనుసరించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఆ నటినటులంతా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన చిరంజీవి గురువు పాత్రలో కనిపించనున్నారట.

Untitled Document
Advertisements