ఆడవారి వస్త్రధారణ పట్ల వివాస్పద వాఖ్యలు చేసిన బీజేపీ నేత

     Written by : smtv Desk | Sat, Apr 08, 2023, 10:56 AM

ఆడవారి వస్త్రధారణ పట్ల వివాస్పద వాఖ్యలు చేసిన బీజేపీ నేత

గడిచిన కొన్నేళ్లుగా హిందుత్వం పై ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే పనిలో భాగంగా కమల నాధులు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారికి తెలియకుండానే కొన్నిసార్లు వారు చేసే వాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అదే విధంగా మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైలాశ్ వర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెడ్డ దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంటారని చెప్పారు. వెంటనే కారు దిగి వారి మత్తు దిగిపోయేలా చెంపలు వాయించాలని అనిపిస్తుందని అన్నారు.

దేవుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడని, మంచి వస్త్రధారణతో మరింత అందం సమకూరుతుందని కైలాశ్ విజయ్ వర్గీయ చెప్పారు. అందుకే మహిళలు మంచి దుస్తులు ధరించాలని ఆయన సూచించారు. కైలాశ్ విజయ్ వర్గీయ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ‘మహిళల్లో దేవతలను చూసే సంస్కృతి మనది.. కానీ కొంతమంది అమ్మాయిలు చెడ్డ దుస్తులు ధరించి తిరుగుతుంటారు. వాళ్లలో దేవతలు కాదు శూర్పణఖ కనిపిస్తుంది. దేవుడు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేస్తుకోండి ఫ్రెండ్స్’ అని చెప్పారు.





Untitled Document
Advertisements